జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..

జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా

Advertisements

<p>జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం&comma; నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను&comma; అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు&period; ఈ సందర్భంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం&comma; యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు&period; కాకినాడ జిందాల్ ప్లాంట్ ఇప్పటివరకు ఎందుకు వినియోగంలోకి రాలేదని పవన్ ప్రశ్నించారు&period; రాబోయే నవంబర్ నాటికి ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని పవన్ కల్యాణ్ కు స్పష్టం చేశారు&period; నదుల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ప్రణాళికలతో రావాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు&period; విద్యుత్ ప్లాంట్ల వల్ల ఏర్పడే కాలుష్యంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు&period; కాలుష్య నియంత్రణకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏడాదికి నాలుగుసార్లు నివేదికలు ఇస్తోందని జిందాల్ ప్రతినిధులు వివరించారు&period; ఇదే విధానాన్ని ఆంధ్రా పేపర్ మిల్లులో ఎందుకు పాటించడం లేదని అధికారులను పవన్ నిలదీశారు&period; కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో పారదర్శకత ఉండాలని&comma; పర్యావరణ పరిరక్షణకు అన్ని పరిశ్రమలు కట్టుబడి ఉండాలని ఈ సమీక్షలో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు&period; ప్లాంట్ల నిర్వహణతో పాటు స్థానిక పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..