ముంబై ఆస్పత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.

Advertisements

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు&period; ఆయన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు&period;<br &sol;>&NewLine;గత కొంతకాలంగా రెండు భుజాలకు సంబంధించిన &&num;8216&semi;రొటేటర్ కఫ్&&num;8217&semi; సమస్యలతో బాధపడుతున్న పవన్ కల్యాణ్&comma; చికిత్స నిమిత్తం ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు&period; ఆయన కుడి భుజానికి వైద్యులు సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు&period; సర్జరీ అనంతరం గత నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన క్రమంగా కోలుకుంటున్నారు&period;<br &sol;>&NewLine;పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొన్ని రోజుల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉంటే పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు&period; పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం&comma; ఆయన త్వరగా కోలుకొని విధుల్లో చేరాలని ఆకాంక్షించారు&period; తాజాగా పవన్ కల్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వార్త తెలియడంతో జనసేన శ్రేణులు&comma; కూటమి నేతలు&comma; అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.