నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటన.

నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటన

Advertisements

<p>నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విస్తృతంగా పర్యటించారు&period; శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;తర్వాత అధికారులు&comma; గ్రామస్థులతో సమావేశమైన ఆమె&&num;8230&semi; గ్రామ అభివృద్ధి&comma; చెంచు గిరిజనుల సమస్యలు&comma; అటవీ ప్రాంత అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు&period;<br &sol;>&NewLine;అనంతరం అధికారులు&comma; ప్రజాప్రతినిధులతో కలిసి నల్లమల జంగిల్ సఫారీ క్యాంప్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు&period;పచ్చర్ల గ్రామంలో రూ&period;20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమిపూజ చేశారు&period;పచ్చర్ల గ్రామానికి ఎన్నోసార్లు వచ్చినప్పటికీ నల్లమల సఫారీ ద్వారా అడవిని సందర్శించడం మరపురాని అనుభూతిని కలిగించిందని ఎమ్మెల్యే తెలిపారు&period; ఆళ్లగడ్డ ప్రాంతంలో 60 వేల హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండటం గర్వకారణమని&comma; నల్లమలను రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు&period;వెదురుపై ఆధారపడిన చెంచుల జీవనాధారానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన అనుమతులు తీసుకువస్తామని తెలిపారు&period;దివంగత నేత శోభా నాగిరెడ్డి పచ్చర్ల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని&comma; ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.