భీమవరం సభలో స్వల్ప కలకలం.

భీమవరం సభలో స్వల్ప కలకలం

Advertisements

<p>అనంతరం వేదికపై అభిమానుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో&period;&period; తోపులాట జరిగింది&period; ఈ క్రమంలో జగన్‌ కిందపడిపోబోయినా&period;&period; అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది&period; ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ సీఎం&comma; వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది&period; ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్న జగన్‌&period;&period; ప్రసంగం ముగించుకుని వేదికపై ఉండగానే అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనను దగ్గరగా చూసేందుకు ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p>అభిమానుల రద్దీతో వేదికపై తోపులాట జరగగా&period;&period; ఆ గందరగోళంలో ఎవరో నెట్టేయడంతో జగన్‌ ఒక్కసారిగా తూలి కిందపడిపోబోయారు&period; అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది&period; అనంతరం భద్రతా సిబ్బంది అభిమానులను వెనక్కి నెట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఈ ఘటనలో జగన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది&period; అయితే వేదికపై భద్రతా ఏర్పాట్లపై చర్చకు తావిచ్చిన ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతున్నాయి&period; అభిమానుల రద్దీని నియంత్రించడంలో లోపాలున్నాయా&period;&period;&quest; లేక అనూహ్యంగా జనసందోహం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందా&period;&period;&quest; అనే అంశాలపై చర్చ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.