జంఝావతి ప్రాజెక్టు… దశాబ్దాలుగా రైతుల ఎదురు చూపులు..

జంఝావతి ప్రాజెక్టు… దశాబ్దాలుగా రైతుల ఎదురు చూపులు

Advertisements

<p>పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం సమీపంలో ప్రవహించే జంఝావతి నది… ఈ ప్రాంత రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న జీవనాడిగా గుర్తింపు పొందింది&period; 1978లో ఈ నదిపై భారీ ఆనకట్టు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది&period; వేలాది ఎకరాలకు సాగునీరు అందించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించినా… ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు వివాదాలు ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకిగా మారాయి&period; దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి&period; రైతుల ఆశలు కూడా అక్కడికే పరిమితమయ్యాయి&period; సంవత్సరాలు గడిచినా… ప్రభుత్వాలు మారినా… జంఝావతి ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు&period; ఇప్పటికీ రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు&period; పంటలు దెబ్బతినడం&comma; నీటి కొరత తీవ్రంగా ఉండటంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి&period; పూర్తి స్థాయి ఆనకట్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీటి పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>జంఝావతి ప్రాజెక్టుపై ఆశలు చిగురించిన ముఖ్యమైన పరిణామం 2005లో చోటుచేసుకుంది&period; ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో నదిపై రబ్బరు డ్యాం నిర్మించడం ద్వారా సాగునీటి సమస్యను కొంతవరకు తగ్గించే ప్రయత్నం జరిగింది&period; ఈ డ్యాం ద్వారా సుమారు 24 వేల ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు&period;దింతో కొంతమేర రైతులకు ఉపశమనం లభించినా… అసలు లక్ష్యమైన భారీ ఆనకట్టు నిర్మాణం మాత్రం ఇంకా నెరవేరలేదు&period; ఫలితంగా ప్రతి వేసవిలో నెలకొనే నీటి కొరత మళ్లీ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది&period; వర్షాలు సరిగా లేకపోతే పంటలు నష్టపోతున్నాయి&period; వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి&period; జంఝావతి ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; సాగునీరు అందుబాటులోకి వస్తే పంటల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం జంఝావతి ప్రాజెక్టు విషయంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది&period; ప్రస్తుతం కేంద్రంలో సహా ఆంధ్రప్రదేశ్‌&comma; ఒడిశాలో కూడా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండటం కీలక అంశంగా మారింది&period; కేంద్ర సహకారంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొంటే… దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జంఝావతి ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసే అవకాశం ఉంది&period; పూర్తి స్థాయి ఆనకట్టు నిర్మాణం జరిగితే దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది&period; పొలాలు పచ్చదనంతో కళకళలాడటమే కాకుండా రైతుల వలసలు కూడా తగ్గుతాయి&period; యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి&period; ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది&period; జంఝావతి కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు… వేలాది మంది రైతుల ఆశలు&comma; భవిష్యత్తుతో ముడిపడిన జీవనాధారం&period; మరి ఈ కల ఎప్పుడు నిజమవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..