తిరుపతి పోలీసుల అవగాహన కార్యక్రమాలు.

Advertisements

<p>మత్తుకు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి&&num;8230&semi;అనే నినాదంతో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది&period; గంజాయి&comma; డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు&comma; తనిఖీలను నిర్వహిస్తోంది&period; ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు&comma; తిరుపతి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది&period; యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం&comma; &period;సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోంది పోలీస్ శాఖ&period; ఏర్పేడు మండలం కాట్రాకాయలకుంటలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో పరిశ్రమ కార్మికులకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు &period; డ్రగ్స్ ఫ్రీ శ్రీ సిటీ లక్ష్యంతో పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు&period; అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఉంచి&comma; గంజాయి వినియోగదారులను గుర్తించే చర్యలు చేపట్టారు&period; అధునాతన సాంకేతికత &&num;8211&semi; సరికొత్త బయో-చెక్ టెస్టింగ్ కిట్లను ఉపయోగిస్తున్నారు&period; ఈ కిట్ల ద్వారా అనుమానితులకు తక్షణమే గంజాయి పరీక్షలు నిర్వహిస్తున్నారు&period; ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు&period; మత్తు వల్ల కలిగే శారీరక&comma; మానసిక&comma; మరియు కుటుంబ పరమైన అనర్థాలను వివరిస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు&period; డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే&comma; బాధితులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.

అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.