అరకులోయలో ట్రైబల్ ఆర్టిజన్ మేళా ఘనంగా ప్రారంభం.

అరకులోయలో ట్రైబల్ ఆర్టిజన్ మేళా ఘనంగా ప్రారంభం

Advertisements

<p>అడవుల ఒడిలో పుట్టిన గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్‌ దిశగా అరకులోయలో కీలక అడుగు పడింది&period; గిరిజన కళ&comma; కృషి&comma; సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రైబల్ ఆర్టిజన్ మేళా విశేష స్పందన లభిస్తోంది&period; భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్&comma; హైదరాబాద్‌ సహకారంతో జరిగిన ఈ ఎంపానెల్‌మెంట్ మేళాలో అల్లూరి&comma; రంపచోడవరం&comma; మన్యం ప్రాంతాల నుంచి గిరిజన కళాకారులు&comma; రైతులు&comma; స్వయం సహాయక సంఘాలు&comma; ఎఫ్‌పీఓలు భారీగా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>అరకు కాఫీ&comma; పసుపు&comma; మిరియాలు&comma; రాగి&comma; చిరుధాన్యాలు&comma; రాజ్మా&comma; అడ్డాకులు&comma; కొండ చీపుర్లు వంటి స్వచ్ఛమైన గిరిజన ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకోగా&comma; లక్క బొమ్మలు&comma; వెదురు వస్తువులు&comma; మట్టి పాత్రలు&comma; టెర్రకోట కళాఖండాలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబించాయి&period; ఈ మేళా ద్వారా గిరిజన ఉత్పత్తులకు అధికారిక గుర్తింపు కల్పించి &&num;8230&semi;జాతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p>గిరిజన ఉత్పత్తులకు సరైన à°§à°°&comma; విశాలమైన మార్కెట్ అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు&period; దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ అవకాశాలు పెరగడం ద్వారా వేలాది గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి&comma; అధిక ఆదాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు&period; సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉండే అవకాశముందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>మొత్తానికి &OpenCurlyDoubleQuote;అడవి నుంచి దేశవ్యాప్త మార్కెట్‌ వరకు&&num;8230&semi; గిరిజన శ్రమకు సరైన గౌరవం&comma; సరైన à°§à°°” అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన అరకులోయ ట్రైబల్ ఆర్టిజన్ మేళా&comma; గిరిజన ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు చూపుతుందని అన్ని శాఖల అధికారుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.

ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.