అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.

అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు

Advertisements

<p>అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది&period; గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు&comma; మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది&period; ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది&period; చంద్రబాబు&comma; నారాయణలను ఈ కేసులో దౌర్జన్యపూరితంగా నిందితులుగా చేర్చారని హైకోర్టు స్పష్టం చేసింది&period; నాటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని&comma; దాని వెనుక కేవలం దురుద్దేశం మాత్రమే ఉందని కోర్టు తప్పుబట్టింది&period; ప్రభుత్వాలు తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదించడం సరికాదని హైకోర్టు పేర్కొంది&period; ఒకవేళ ప్రతి నిర్ణయానికి ఇలాగే నేరాలను ఆపాదిస్తూ పోతే&comma; అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది&period; అమరావతి భూములకు సంబంధించి నాటి ప్రభుత్వం చట్ట నిబంధనలను అనుసరించే జీవో 141ని తీసుకువచ్చిందని కోర్టు స్పష్టం చేసింది&period; ఈ జీవో వల్ల తాము నష్టపోయామంటూ అసలైన భూ యజమానులు గానీ&comma; రైతులు గానీ ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని ఈ సందర్భంగా గుర్తుచేసింది&period; సీఆర్డీఏ పరిధిలో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చట్టపరమైన రక్షణ ఉంటుందని హైకోర్టు వెల్లడించింది&period; చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం అధికారులను లేదా ప్రజాప్రతినిధులను ఇలాంటి నిర్ణయాలపై ప్రాసిక్యూట్ చేయడాన్ని చట్టం నిషేధిస్తుందని స్పష్టం చేసింది&period; చంద్రబాబు&comma; నారాయణలపై మోపిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పిన ఏపీ హైకోర్టు&&num;8230&semi; వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ సదరు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తన తుది తీర్పులో ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.

ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.