పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.

పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. 'వీజీఎఫ్ విప్లవం ఖాయం

Advertisements

<p>రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; పీపీపీ ప్రాజెక్టులు&comma; ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం&&num;8230&semi; త్వరలోనే &&num;8216&semi;ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1&period;0&&num;8217&semi;ను తీసుకురావాలని ఆదేశించారు&period; ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు&period; భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు&period; త్వరలోనే &&num;8216&semi;ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1&period;0&&num;8217&semi;ను కేబినెట్ ముందుకు తీసుకురావడంతో పాటు&&num;8230&semi; దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టులు&comma; విమానాశ్రయాలు&comma; పర్యాటకం తదితర రంగాల్లో 1 లక్షా 23 వేల 229 కోట్ల రూపాయల విలువైన 260 ప్రాజెక్టులు పీపీపీ విధానంలో పురోగతిలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు&period; పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణాన్ని కేంద్రం ప్రశంసించిందని&&num;8230&semi; వాటికి 1&comma;468 కోట్ల రూపాలయ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మంజూరవుతోందని తెలిపారు&period; విజయవాడ&comma; తిరుపతిలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు కూడా కేంద్రం 178 కోట్ల వీజీఎఫ్ అందిస్తున్నట్లు వెల్లడించారు&period; ప్రతి ప్రాజెక్టును ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడే సుస్థిర నమూనాలో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు&period; కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులను భాగస్వాములను చేసి వారికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు&period; రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని ఆదేశించారు&period; ప్రతి శాఖ స్వల్ప&comma; మధ్య&comma; దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను రూపొందించి ఆదాయ వనరులను పెంచుకోవాలని స్పష్టం చేశారు&period; అదే సమయంలో బలహీన వర్గాల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి&&num;8230&semi; రెసిడెన్షియల్ హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.

అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.