మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు.

మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది&period; రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది&period; తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది&period; జూన్ 26à°µ తేదీ నుంచి జులై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి&period; ఈ కేసులను కడప&comma; విశాఖపట్నం&comma; కాకినాడ&comma; గుంటూరు జిల్లాల్లో గుర్తించారు&period; నలుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి&period; మిగిలిన బాధితుల్లో ముగ్గురు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా&comma; ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు&period; ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది&period; కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది&period; అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు&comma; టెస్టింగ్ కిట్లు&comma; ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది&period; ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ&comma; ప్రజలు జాగ్రత్తగా ఉండాలని&comma; ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు&period; పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.