45 రోజుల పాటు టీడీపీ ఇంటింటి ప్రచారం.

Advertisements

<p>ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా చేరిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది&period; 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించనుంది&period; ఈ ప్రచార కార్యక్రమంపై పార్టీ అధినేత&comma; ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు&period; ప్రజలకు ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;<p>కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు&period; 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మంత్రుల నుంచి బూత్ స్థాయి కన్వీనర్ల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదేశించారు&period; ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్లినట్లే&period;&period; ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసిన హామీలు&comma; సంక్షేమ పథకాలు&comma; అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు&period; గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని చంద్రబాబు గుర్తు చేశారు&period; 94 శాతం స్ట్రైక్ రేట్&comma; 57 శాతం ఓట్లతో విజయం సాధించామని తెలిపారు&period; గత ప్రభుత్వ వైఫల్యాలు&comma; కూటమి సమిష్టి పోరాటం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు&period; అదే స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువ కావాలని పార్టీ నేతలకు సూచించారు&period;<&sol;p>&NewLine;<p>పార్టీలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కూడా సీఎం నొక్కి చెప్పారు&period; తనకు అనుచరులు కాదు&period;&period; నాయకులు కావాలని స్పష్టం చేశారు&period; సమస్యలకు పరిష్కారం చూపే సామర్థ్యాన్ని పెంచుకోవాలని&period;&period; ప్రజలు&comma; కార్యకర్తలతో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు&period; రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు&period; ప్రతిపక్ష పార్టీ విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కూడా చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు&period; గత పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించాలని&period;&period; ముఖ్యంగా యువతకు జరిగిన నష్టాన్ని&comma; కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు&period; ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తేనే ప్రతిపక్ష విమర్శలకు సమాధానం ఇవ్వగలమని అన్నారు&period; మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమేనని విశ్వాసం వ్యక్తం చేస్తూనే&period;&period; ఏమరుపాటుకు తావు ఇవ్వొద్దని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం&comma; స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం లక్ష్యంగా టీడీపీ చేపడుతున్న 45 రోజుల ఇంటింటి ప్రచారం రాజకీయంగా ఎంత మేర ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.