రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలి: పవన్ కళ్యాణ్.

Advertisements

<p>ఏపీ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు&comma; పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు&period; సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించి&comma; సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు&period; అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ పక్షుల కేంద్రం &&num;8216&semi;కొండకర్ల ఆవ&&num;8217&semi;ను &&num;8216&semi;కన్జర్వేషన్ రిజర్వ్‌&&num;8217&semi; ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో కీలక ముందడుగు పడిందని డెప్యూటీ సీఎం తెలిపారు&period; వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం దీనిని కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది&period; జలవనరుల శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది&period; సాగునీరు&comma; జలాశయ నిర్వహణ&comma; హైడ్రాలిక్ వ్యవస్థలు&comma; ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఎలాంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతులు లభించాయి&period;<&sol;p>&NewLine;<p>శాస్త్రీయ అధ్యయనాలు&comma; క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా రాష్ట్రంలో మొత్తం 950 చిత్తడి నేలలను గుర్తించామని&comma; వీటిని నోటిఫై చేయాల్సి ఉందన్నారు&period; తొలిదశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని వెల్లడించారు&period; చిత్తడి నేలలు భూగర్భ జలాల పునరుద్ధరణ&comma; వరదల నియంత్రణ&comma; జల భద్రత మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు&period; చిత్తడి నేలలపై జరిగే అక్రమ ఆక్రమణలు&comma; విధ్వంసక చర్యలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు&period; అనేక రకాల వలస మరియు స్థానిక పక్షులకు నిలయంగా ఉన్న కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేయాలని&comma; జలవనరుల శాఖ సమన్వయంతో ఎకో-టూరిజం అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.