నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని&ZeroWidthSpace; నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు&period; అంతకుముందు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ఉదయం 11 గంటలకు పరిశీలిస్తారు&period; అలాగే భోగాపురంలో 17 వేల 900 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన&comma; ప్రారంభోత్సవం చేస్తారు&period; అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు&period; &ZeroWidthSpace;ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం పద్ధతిలో 5&comma;640 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు&period; ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా నిర్మించారు&period; ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ&comma; బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్&comma; ఎయిర్‌సైడ్ 4&period;0 సాంకేతిక పరిజ్ఞానాలు&comma; ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్&comma; బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్&comma; ఆటోమేటెడ్ బ్యాగేజి హ్యాండ్లింగ్ వ్యవస్థలు&comma; ఇంటిలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;<p>విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది&period; అదే స్థాయి ప్రమాణాలతో భోగాపురం ఎయిర్ పోర్టును సిద్ధం చేసింది&period; విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా&period;&period; పరిశ్రమలు&comma; ఉపాధి&comma; ఎగుమతులు&comma; నైపుణ్యాభివృద్ధి&comma; పరిశోధనలకు కేంద్రబిందువుగా మారేలా అల్లూరి సీతారామ రాజు ఎయిర్ పోర్టుకు రూపకల్పన చేశారు&period; దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటి&period; నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే కాకుండా&comma; మొదట నిర్ణయించిన గడువుకంటే దాదాపు ఐదు నెలల ముందే సిద్ధం చేశారు&period; ఉమ్మడి విశాఖపట్నం&comma; విజయనగరం&comma; శ్రీకాకుళం జిల్లాల ఆర్థికాభివృద్ధికి&comma; పర్యాటక రంగ విస్తరణకు&comma; పారిశ్రామిక పెట్టుబడులకు&comma; ఎగుమతులకు&comma; లాజిస్టిక్స్‌కు&comma; ఏరోస్పేస్&comma; డిఫెన్స్ రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక వసతిగా మారనుంది&period;<&sol;p>&NewLine;<p>భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాడ్యులర్ విధానంలో భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు&period; తొలి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది&period; భవిష్యత్‌లో దశలవారీ విస్తరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు&period; ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ టెర్మినల్&comma; ఎయిర్‌సైడ్&comma; కమర్షియల్ మౌలిక వసతులను విస్తరించేందుకు వీలుగా ప్రాజెక్టును రూపొందించారు&period; భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు&period; ప్రయాణికుల సౌకర్యం&comma; వేగవంతమైన ప్రాసెసింగ్&comma; ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచేందుకు కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు&comma; కామన్ యూజ్ పాసింజర్ ప్రాసెసింగ్ వ్యవస్థ&comma; సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్&comma; సెల్ఫ్ సర్వీస్ పాసింజర్ ప్రాసెసింగ్&comma; స్మార్ట్ సర్వైవలెన్స్&comma; యాక్సెస్ కంట్రోల్&comma; సెక్యూర్టీ మేనేజ్మెంట్ సిస్టం&comma; ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.