ఏపీ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల దిశగా అడుగులు.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్&comma; ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది&period; ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య&comma; పౌరసత్వ వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు విచ్చేశారు&period; గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి టీజీ భరత్‌ ఘన స్వాగతం పలికారు&period; అనంతరం ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లింది&period; గతేడాది మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సమయంలో చేసిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించి&comma; ఆస్ట్రేలియా మంత్రివర్గ బృందం ఏపీకి వచ్చిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు&period; విద్యారంగంలో సహకారం&comma; అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు మరియు పెట్టుబడులపై కీలక చర్చలు జరిపేందుకు ఈ పర్యటన చక్కటి అవకాశమని ఆశాభావం వ్యక్తం చేశారు&period; ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు&comma; మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు&period; ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు&comma; మంత్రి నారా లోకేష్ అమరావతికి చేరుకుని ఆస్ట్రేలియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు&period; ఈ సమావేశంలో విద్యారంగంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంపై చర్చలు జరుగనున్నాయి&period; ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు&comma; నైపుణ్యాభివృద్ధి&comma; పరిశోధనా రంగాల్లో సహకారం అందించడంపై చర్చించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.