ముదిగొండలో రహదారి విస్తరణ పనులపై ఉద్రిక్తత.

Advertisements

<p>ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి&period; డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిర పరిధిలోని ముదిగొండ కూడలి వద్ద అధికారులు పనులు ప్రారంభించగా&comma; స్థలాలు&comma; దుకాణాలు కోల్పోతున్నామంటూ స్థానికులు&comma; వ్యాపారులు తీవ్ర నిరసన చేపట్టారు&period; రోడ్డుపై బైఠాయించి పనులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; మరోవైపు గ్రామాభివృద్ధి కోసం రహదారి విస్తరణ అవసరమని మరో వర్గం మద్దతు తెలపడంతో పరిస్థితి మరింత వేడెక్కింది&period; ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించిన అధికారులు&comma; బాధితులతో చర్చలు జరిపి నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు&period; దీంతో ఆందోళన విరమించగా&comma; పోలీసుల బందోబస్తు మధ్య రహదారి విస్తరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.