అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏపీ సర్కార్ ఆదేశం.

Advertisements

<p>అగ్రిగోల్డ్ బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను మరింత తీవ్రతరం చేసింది&period; డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా మళ్లించి నిలువునా ముంచిన యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది&period; విచారణలో భాగంగా సీఐడీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల డబ్బుతో బంధువుల పేరిట కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి&period; ఈ ఆస్తులను వెంటనే జప్తు చేయాలని హోం శాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;<p>అగ్రిగోల్డ్ కంపెనీల జాయింట్ ఎండీగా వ్యవహరించిన అవ్వా హేమ సుందర వరప్రసాద్ తన అత్త ఎల్లా జయలక్ష్మి పేరిట కృష్ణా జిల్లాలోని పోరంకి&comma; పెనమలూరు&comma; ఈదర ప్రాంతాల్లో 6&period;55 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు&period; ఈ కొనుగోళ్లన్నీ డిపాజిటర్ల సొమ్ముతోనే జరిగినట్లు నిర్ధారణ కావడంతో వీటి జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి&period; అక్రమ పెట్టుబడుల దర్యాప్తు పొరుగు రాష్ట్రాలకూ విస్తరించగా&comma; కర్ణాటకలోని బెంగళూరు జిల్లా అనేకల్ తాలూకా&comma; సర్జాపూర్ హోబ్లీ పరిధిలోని ముత్తనల్లూర్ అమ్మనికేరి గ్రామంలో ఎన్&period; మమత అనే మహిళ పేరిట ఉన్న 3&period;32 ఎకరాల భూమిని కూడా గుర్తించారు&period; ఈ ఆస్తుల జప్తు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని సీఐడీ డైరెక్టర్ జనరల్ ను ప్రభుత్వం ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్