పులివెందులలో విద్యార్థులను ర్యాలీకి తరలించడంపై బీటెక్ రవి ఆగ్రహం.

Advertisements

<p>కడప జిల్లా పులివెందులలో రాజకీయ ర్యాలీలకు విద్యార్థులను తరలించడంపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; పులివెందులలోని ఓ ప్రైవేట్ కళాశాల వద్దకు చేరుకున్న ఆయన&period;&period; నిన్న జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి కాలేజీ విద్యార్థులను తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు&period; వైసీపీ పార్టీ నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని బీటెక్ రవి ఆరోపించారు&period; ఎంపీ పిల్లలు హైదరాబాద్‌లో చదువుకోవాలా&period;&period; ఇక్కడి విద్యార్థులను మాత్రం రాజకీయ ర్యాలీలకు తీసుకెళ్లాలా అంటూ ప్రశ్నించారు&period;<br &sol;>&NewLine;ర్యాలీకి జన బలం లేకపోతే తమను అడిగితే ప్రజలను పంపిస్తామని వ్యాఖ్యానించారు&period; రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లాలని ఒత్తిడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు&period; అదే సమయంలో డీఎస్సీకి అనుకూలంగా రాజకీయ కార్యకర్తలను కాకుండా ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించాలని బీటెక్ రవి సూచించారు&period; విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్