పార్టీ మార్పుపై పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్.

Advertisements

<p>బాన్సువాడ ఎమ్మెల్యే&comma; మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం &comma; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు&period; కామారెడ్డి జిల్లా బిర్కూర్ చెక్ డ్యామ్ వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ&period;&period; తాను ఏ మంత్రి పదవి కోసమో లేదా డబ్బు కోసమో కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని స్పష్టం చేశారు&period; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మోసం చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని&comma; కేవలం నియోజకవర్గంలోని కొంతమంది దౌర్భాగ్యుల వల్ల&comma; నాటి పరిస్థితుల ప్రభావం వల్లనే పార్టీ మారాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; తాను కాంగ్రెస్ జెండాను కాదని&comma; కేవలం జాతీయ జెండానే కప్పుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;<p>తన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని పోచారం ఆరోపించారు&period; తాను కాంగ్రెస్‌లో చేరే సమయంలో నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులను&comma; సిద్ధాపూర్ రిజర్వాయర్ వంటి ప్రాజెక్టుల బిల్లులను ఆరు నెలల్లోగా పూర్తి స్థాయిలో మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు&period; అయితే పార్టీ కండువా కప్పుకున్న తర్వాత సగం నిధులు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని&comma; బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులన్నీ నిలిపివేశారన్నారు&period; నిధుల కోసం అడిగితే స్పందన కరువైందని వాపోయారు&period;<&sol;p>&NewLine;<p>నేను నీకు అమ్ముడుపోయానా లేక నా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని గత నవంబరులోనే సీఎంను సూటిగా నిలదీసినట్లు వెల్లడించారు&period; సీనియర్ నేతనైన తాను నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం&comma; నిధుల విడుదల కోసం సీఎంకు&comma; మంత్రులకు పలుమార్లు ఫోన్ చేసినా కనీసం కాల్స్ కూడా ఎత్తడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు&period; నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నిస్తూ&comma; బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటేనే జీవోలు వచ్చే స్థితి నుంచి నేడు నిధుల కోసం దేవురించే పరిస్థితి వచ్చిందన్నారు&period; ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందని పోచారం ఎద్దేవా చేశారు&period; నియోజకవర్గంలో 90 శాతం మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తన వెంట వచ్చారని&comma; అదంతా కేవలం అభివృద్ధి కోసమేనని తెలిపారు&period; అయితే హామీలు నెరవేర్చకపోవడం వల్ల కిందిస్థాయి శ్రేణులకు జవాబు చెప్పుకోలేకపోతున్నానని తెలిపారు&period; పోచారం అసంతృప్తి తెలంగాణ రాజకీయాల్లో హైలెట్‌గా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్