విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది&period; విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి&period; కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు&period; వారానికి మూడు రోజులు&period;&period; మంగళవారం&comma; గురువారం&comma; శనివారం ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి&period; దీంతో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు వ్యాపారం&comma; విద్య&comma; పర్యాటకం కోసం ప్రయాణించే వారికి మరింత సౌలభ్యం కలగనుంది&period; టైర్-2&comma; టైర్-3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానించడమే లక్ష్యమన్నారు&period; మరోవైపు నాగార్జున సాగర్&comma; ప్రకాశం బ్యారేజ్&comma; శ్రీశైలం ప్రాజెక్ట్ మధ్య సీ-ప్లేన్ ప్రాజెక్టుపై కూడా వ్యూహరచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.