ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

Advertisements

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25à°¨ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు&period; కనేకల్-1&comma; కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు&period; మంత్రి పర్యటన నేపథ్యంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఏర్పాట్లను పరిశీలించారు&period; కనేకల్ క్రాస్ వద్ద హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలంతో పాటు బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని అధికారులతో&comma; టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు&period;టాటా పవర్&comma; వ్యారీస్&comma; సుజలాన్ సంస్థలు సంయుక్తంగా దాదాపు వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు&period; ఇటీవల పత్తికొండలో టాటా పవర్ ఆధ్వర్యంలో చేపట్టిన 400 మెగావాట్ల &OpenCurlyQuote;కనేకల్ వన్’ ప్రాజెక్టుకు నారా లోకేష్ వర్చువల్‌గా భూమిపూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు&period; ఇప్పుడు కనేకల్‌లో మరో 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు మంత్రి ప్రత్యక్షంగా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు&period;ఈ నెల 25à°¨ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.