ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.

Advertisements

<p>సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారి ఎన్‌&period;సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది&period; గతంలో ఆయన అగ్నిమాపకశాఖ&comma; సీఐడీ విభాగాల్లో విధులు నిర్వర్తించారు&period; సర్వీసు నిబంధనలు&comma; క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రభుత్వం రాతపూర్వక వివరణ కోరగా సంజయ్‌ ఇవ్వలేదు&period; దీంతో ఆయనపై సాధారణ విచారణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; విచారణాధికారిగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ను సీఎస్‌ సాయిప్రసాద్‌ నియమించారు&period; నిర్ణీత గడువులోపు విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు&period; గతేడాది జనవరిలో సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది&period; తన పరిధిలో లేకపోయినా రూ&period;1&period;20కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి&period; ఈ క్రమంలో 8 అంశాలను ప్రస్తావిస్తూ వివరణ ఇవ్వాలని ప్రభుత్వం సంజయ్‌ను ఆదేశించింది&period; ఆయన స్పందించకపోవడంతో విచారణ నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.