అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.

Advertisements

<p>అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు&period; రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు&period; సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1&comma;325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం నిర్వహించారు&period; హులికెరలో సుజ్లాన్‌ S144 కొత్త బ్లేడ్‌ ఉత్పత్తి లైన్లను మంత్రి లోకేష్‌ ప్రారంభించారు&period; పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు&period;పవన విద్యుత్‌ ఉత్పత్తితో పాటు స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి&comma; ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు&period; భారీ పెట్టుబడులతో అనంతపురం జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి&period; రాయదుర్గం ప్రాంతాన్ని గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది&period; 1&comma;325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో అనంతపురం పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.