కర్నూలు జిల్లా మొదలైన వజ్రాల వేట..

కర్నూలు జిల్లా మొదలైన వజ్రాల వేట

Advertisements

<p>తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడిందంటే చాలు రైతులు వ్యవసాయ పనుల కోసం సిద్ధమవుతారు&period; కానీ ఏపీలోని రాయలసీమలో మాత్రం మొదటి వర్షం కురిస్తే చాలు&period;&period; వజ్రాల వేట మొదలవుతుంది&period; గత రెండు రోజులుగా సీమ ప్రాంతంలో కురిసిన తొలకరి వర్షాలు స్థానిక ప్రజలకు సరికొత్త ఆశలను మోసుకొచ్చాయి&period; పత్తికొండ తాలూకా గిరి గట్ల నుండి జొన్నగిరి పరిసర ప్రాంతాలలో వజ్రాలు దొరకడం అనేది సహజంగా అందరికీ తెలిసిందే&period; గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో&comma; ఎగువ మట్టి కొట్టుకుపోయిన వజ్రాలు బయటపడే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలతో పాటు పొరుగు ప్రాంతాల వారు కూడా పొలాల బాట పట్టారు&period; చిన్న వజ్రం దొరికినా తమ తలరాత మారిపోతుందనే బలమైన నమ్మకంతో&comma; వందలాది మంది ప్రజలు ఉదయాన్నే ఫుడ్ క్యారేజీలు సర్దుకుని వచ్చి జొన్నగిరి పరిసరాల్లోని వ్యవసాయ పొలాలను జల్లెడ పడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>రాయలసీమ ప్రాంతంలో వర్షాకాలం ప్రారంభంలో వజ్రాల కోసం అన్వేషణ సాగించడం దశాబ్దాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ&period; ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు &comma; కర్నూలు జిల్లాలోని జొన్నగిరి&comma; పెరవలి తదితర ప్రాంతాలలో ఈ వజ్రాల వేట ఎక్కువగా కనిపిస్తుంది&period; ప్రతి ఏటా తొలి వర్షం పడగానే స్థానిక రైతులు&comma; కూలీలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే &&num;8216&semi;లక్&&num;8217&semi; అన్వేషకులు ఇక్కడి ఎర్రనేలల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు&period; ఇక్కడ లభ్యమయ్యే విలువైన రత్నాలను కొనుగోలు చేసేందుకు గుంటూరు&comma; ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వజ్రాల వ్యాపారులు&comma; స్థానిక ఏజెంట్లు ఇక్కడే మకాం వేసి రికార్డు ధరకు వాటిని సొంతం చేసుకుంటుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..