మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.

Advertisements

<p>మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు&period; డీఎస్సీకి&comma; ఏపీపీఎస్సీకి తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు&period; తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేశారని గుర్తుచేసిన లోకేశ్&period;&period; ఇప్పటికే 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు&period; డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టుల్లో అనేక కేసులు వేసినా ఎక్కడా ప్రభుత్వం తప్పు చేసిందని తేలలేదన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి&comma; దాడులకు పాల్పడుతున్న వారిపై లోకేశ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు&period; ఉపాధ్యాయుల జోలికి ఎవరైనా వెళితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు&period; డీఎస్సీపై ప్రభుత్వం ఇప్పటికే ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చిందని&comma; అయినా పదేపదే ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు&period; ఇదే సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసును ప్రస్తావిస్తూ&period;&period; చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారని&comma; ఆ కేసులో తమ నాయకుడికి క్లీన్‌చిట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు&period; ప్రతి సంవత్సరం సుమారు 3 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి&period;&period; ఐదేళ్లలో దాదాపు 30 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు&period; చేతనైతే తనను ఆపాలని జగన్‌కు సవాల్ విసిరారు&period; ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్న లోకేశ్&period;&period; తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.