రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన..

రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన

Advertisements

<p>రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన వడివడిగా సాగింది&period; జీవ నది గోదావరి కాలుష్య నియంత్రణ&comma; పుష్కరాల ఏర్పాట్లపై ఆయన అధికారులు నుంచి సమగ్ర వివరాలు తెలుసుకున్నారు&period; బోటుపై పయనించి గోదావరి కాలుష్యాన్ని పరిశీలించారు&period; నదీ తీర ప్రాంతాల్లో అపరిశుద్ధ్యం&comma; రేవుల నిర్వహణపై అధికారులను నిలదీశారు&period; అనంతరం కోటిలింగాల ఘాట్‌కు బోటుపైనే చేరుకొన్నారు&period; నదీ తీర పరిస్థితిని స్వయంగా చరవాణిలో బంధించారు&period; పెద్ద ఘాట్‌ కోటిలింగాల రేవు వద్ద తుప్పలు పేరుకుపోవడంపై అసహనం వ్యక్తం చేశారు&period; అక్కడ నుంచి నల్లాఛానల్‌ వరకూ నడిచి వెళ్లారు&period; మురుగునీరు నేరుగా గోదావరిలో కలవడం&comma; ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగిపోవడం చూసి&period;&period; అదే నీటిని తాగునీటికి వినియోగిస్తున్నారా&period;&period;&quest; అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; నల్లాఛానల్‌ పంపింగ్‌ స్కీమ్‌ పనితీరును తెలుసుకొన్నారు&period;<&sol;p>&NewLine;<p>గోదావరిలో పారిశ్రామిక వ్యర్థాలు విడిచిపెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతోందని&comma; నియంత్రణకు సహకరించాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు&period; సంబంధిత యాజమాన్యాలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నదిలోకి విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు&period; పుష్కరాల 12 రోజులు పేపరుమిల్లు మూసివేస్తామని నిర్వాహకులు పేర్కొనగా&period;&period; అంత కాలుష్యం లేకుంటే ఎందుకు మూసేస్తారని ప్రశ్నించారు&period; జీవనదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.