గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం

Advertisements

<p>కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు&comma; అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి భూముల అగ్రిమెంట్లు చేయించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు&period; అయితే హామీలు నెరవేర్చకుండా తొమ్మిదేళ్లుగా తమను మోసం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్లు 313&comma; 314&comma; 319&comma; 320 ప్రాంతాల్లో సుమారు 92 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉంది&period; దాదాపు 90 మంది రైతులకు చెందిన ఈ భూముల్లో ఏటా మూడు పంటలు పండుతుంటాయి&period;అయితే తొమ్మిదేళ్ల క్రితం విష్ణుప్రియ ప్రైవేట్ వెంచర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణ రైతులను సంప్రదించి&period;&period; ఈ ప్రాంతంలో భారీ అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడతామని చెప్పినట్లు రైతులు ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>డెవలప్‌మెంట్ కోసం భూములు అవసరమని&comma; భూములకు ప్రతిఫలంగా అపార్ట్మెంట్లలో ప్లాట్లతో పాటు భారీ మొత్తంలో నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారని రైతులు చెబుతున్నారు&period;హామీలను నమ్మిన రైతులు అగ్రిమెంట్లపై సంతకాలు చేసినప్పటికీ&comma; కొంతమందికి మాత్రమే డబ్బులు చెల్లించి&comma; మిగిలిన వారికి ఎలాంటి చెల్లింపులు చేయలేదని ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>తమకు రావాల్సిన మొత్తాల గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని&comma; భూములను తక్కువ ధరకే విక్రయించాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోతున్నారు&period;ఈ వ్యవహారం జరిగి దాదాపు తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని&comma; ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.