విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..

విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్

Advertisements

<p>పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది&period; పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ&period;2&period;5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన &OpenCurlyQuote;త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది&period; ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలాన్ని ఆవిష్కరించారు మంత్రి నారాయణ&period; ఈ త్రిశూలం మొత్తం ఎత్తు 65 అడుగులు&period; దీనికి అమర్చిన శివుని ఢమరుకం 10 అడుగుల ఎత్తు&comma; 18 అడుగుల వెడల్పుతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది&period; సుమారు రూ&period; 2&period;5 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ భారీ త్రిశూలాన్ని పూణేకు చెందిన ప్రత్యేక శిల్పులు ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు&period; పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ పర్యాటకులను ఆకర్షించేలా త్రిశూలం లోపల ప్రత్యేక LED దీపాలను అమర్చారు&period; చీకట్లో ఈ విద్యుత్ కాంతులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి&period; సముద్ర తీర ప్రాంతం కావడంతో విశాఖలో తరచూ వచ్చే తుపాన్లు&comma; ప్రచండ గాలులను సైతం తట్టుకుని నిలబడేలా అత్యంత పటిష్టంగా దీని నిర్మాణం చేపట్టారు&period; కైలాసగిరిపై ఇప్పటికే శివపార్వతుల భారీ విగ్రహాలు ఉండగా&comma; తాజాగా ఈ నూతన త్రిశూల ఏర్పాటుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..