యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..

యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం

Advertisements

<p>యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది&period; ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి&period; ముఖ్యంగా రాజపేట మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 322లో కొనసాగుతున్న క్రషర్ యూనిట్ చుట్టూ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది&period; అనుమతులు లేకుండా క్రషర్ యూనిట్ నడుస్తోందని&comma; ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు&period; ఈ వ్యవహారంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేరు వినిపించడం రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది&period; ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు&period; అధికారుల స్పందన లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు&period; దీంతో ఇప్పుడు చల్లూరు క్రషర్ వివాదం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p>చల్లూరు గ్రామంలోని క్రషర్ యూనిట్‌పై స్థానిక రైతులు&comma; గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; భారీ స్థాయిలో జరుగుతున్న బ్లాస్టింగ్‌à°² వల్ల గ్రామం మొత్తం భయాందోళనలకు గురవుతోందని చెబుతున్నారు&period; బ్లాస్టింగ్ సమయంలో భూములు కంపిస్తుండటంతో ఇళ్లలో పగుళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు&period; రోజంతా క్రషర్ నుంచి ఎగిసిపడుతున్న దట్టమైన దుమ్ముతో గ్రామం కాలుష్యానికి గురవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ముఖ్యంగా పంటలపై దుమ్ము పేరుకుపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు&period; చెరువు నీరు కూడా కలుషితమై పశువులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు&period; గడ్డి&comma; పశువుల మేతపై దుమ్ము పేరుకుపోవడంతో పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అంటున్నారు&period; గ్రామంలో చిన్నపిల్లలు&comma; వృద్ధులు శ్వాసకోశ సమస్యలు&comma; దగ్గు&comma; అలర్జీలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు&period; వెంటనే అధికారులు స్పందించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని&comma; రైతులకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>అయితే తమపై వస్తున్న అన్ని ఆరోపణలను శ్రీని కన్‌స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ యాజమాన్యం పూర్తిగా ఖండిస్తోంది&period; సంస్థ ఎండీ కర్నాటి శ్రీదేవి మాట్లాడుతూ తమ కార్యకలాపాలన్నీ పూర్తిగా చట్టబద్ధంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు&period; 2016-17 సంవత్సరాల్లో రైతుల నుంచి సుమారు 450 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు&period; అనంతరం 2019లో సర్వే నంబర్ 322 పరిధిలో డీటీసీపీ అనుమతులతో లేఅవుట్ అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు&period; భూమిలో రాయి అధికంగా ఉండటంతో అభివృద్ధి పనుల కోసం బ్లాస్టింగ్ అవసరమైందని వివరించారు&period; 2021లో ఇండస్ట్రీస్&comma; పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్&comma; మైనింగ్&comma; ఎలక్ట్రిసిటీ శాఖల నుంచి అన్ని అనుమతులు తీసుకుని క్రషర్ యూనిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు&period; మైనింగ్ శాఖకు రాయల్టీలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు&period; రాజకీయ కారణాలతోనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని&comma; అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.