బాదంలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఈ, కాల్షియం, జింక్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇవి మెదడు, కళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. బాదంలో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, కొందరు ఆరోగ్యానికి బాదం మేలు చేస్తుందని ఎక్కువగా తింటూ ఉంటారు. బాదం అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదం ఎక్కువగా తింటున్నారా అయితే ఇది తెలుసుకోండి. బాదం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో విటమిన్ E మోతాదులు పెరుగుతాయి. విటమిన్ E కొవ్వులో కరిగే విటమిన్. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే విషంగా మారవచ్చు. దీని కారణంగా కడుపులో తిమ్మిరి, డయేరియా, జీర్ణసమస్యలు ఎదురవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. విటమిన్ ఇ స్థాయిలు ఎక్కువైతే.. రక్తం గడ్డకట్టే ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. బాదంలో ఆక్సలేట్లు ఉంటాయి. ఈ ఆక్సలేట్లు ఎక్కువగా తీసుకుంటే కీడ్నీలో రాళ్లకు కారణం అవుతాయి. దీని దృష్టిలో ఉంచుకుని బాదం, మితంగా తీసుకోవడమే మేలు. బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. పైటిక్ యాసిడ్ కాల్షియం, ఇనుము, జింక్ శోషణను ప్రభావితం చేస్తుంది. జీర్ణవ్యవస్థ ఈ పోషకాలు గ్రహించకుండా అడ్డుపడుతుంది.
బాదం ఎక్కువగా తింటున్నారా..!
86
previous post