100
రాత్రంతా నానబెట్టిన వేరుశనగను ఉదయాన్నే ముందుగా తీసుకోవాలి. వేరుశనగలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రంతా నానబెట్టిన వేరుశనగ తినడం వల్ల మన కండరాలు బలపడతాయి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన వేరుశనగ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి జీర్ణక్రియ బాగా జరగాలంటే నానబెట్టిన వేరుశనగ తినండి. మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే, నానబెట్టిన వేరుశనగ గింజల వినియోగం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. మన జ్ఞాపకశక్తి, కంటి చూపును మెరుగుపరచడానికి నానబెట్టిన వేరుశనగను తినాలి. గుండె ఆరోగ్యం కోసం మీరు నానబెట్టిన వేరుశనగ తినాలి. ఇది అనేక గుండె సమస్యలను నయం చేస్తుంది.