అల్లం నీరు తీసుకోవడం వల్ల అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడమే కాదు. అల్లం నీరుతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి, మెగ్నీషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. ఇక చాలా మంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు. అయితే ఎలాంటి నొప్పులను అయినా తగ్గించే గుణం అల్లానికి ఉంది. అందుకే ప్రతిరోజు అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే ప్రతిరోజు అల్లం నీరు తాగితే. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అజీర్తితో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. అయితే అల్లం మంచిదే కాని, అల్లం పై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు. చాలా మంది అల్లాన్ని వేడినీటిలో కలిపి తాగేటప్పుడు తొక్క తీయకుండా యూజ్ చేస్తారు. వాస్తవానికి అల్లం పై తొక్కలో విష పదార్థాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు. అల్లం తొక్క తీసి ఉపయోగించాలని సూచిస్తున్నారు.
అల్లం వేడినీటిలో కలిపి తాగుతున్నారా..!
98
previous post