నవగ్రహ దోషాలు పీడిస్తున్నాయా.. ఇలా చెయ్యండి!

Navagraha doshas

Advertisements

&NewLine;<p>నవగ్రహ దోషాలు ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది&period; అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు&period; అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి&period; అందుకే జాతకంలో నవగ్రహదోషాలు ఉంటే&period; వాటికి పరిహారం చేయించుకోవడం చాలా అవసరం&period; మరి ఏ గ్రహదోషం ఉంటే ఏ పరిహారం చేయాలనే విషయాలు ఇప్పుడు చూద్దాం&period; నవగ్రహాల్లో మొదటిది రవి &lpar; సూర్యుడు &rpar;&period; జాతకంలో రవి బలహీనంగా ఉంటే అనారోగ్యం&comma; అధికారుల నుంచి వేధింపులు&comma; అనారోగ్య సమస్యలు&comma; ఆత్మ విశ్వాసం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి&period; ఇటువంటి వారు భానుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి&period; గోధుమ పిండి&comma; గోధుమ రొట్టె&comma; కాషాయ వస్త్రాలు&comma; రాగి&comma; రాగి జావ&comma; మిరియాలు దానం చేయాలి&period; జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనస్సు నిలకడగా ఉండదు&period; మానసిక వ్యాధులు వెంటాడతాయి&period; రాత్రిళ్లు నిద్ర పట్టదు&period; భయం&comma; అనుమానం&comma; స్త్రీలతో విరోధం ఉంటాయి&period; స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఎదురవుతాయి&period; చంద్రుడి అనుగ్రహం కోసం బియ్యం&comma; పాలు&comma; మజ్జిగ దానం చేయాలి&period; శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించాలి&period; పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయాలి&period; వివాహానికి&comma; సంతానానికి ప్రధానమైన గ్రహం కుజుడు&period; కుజ దోషం ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి&period; ప్రమాదాల బారిన పడుతుంటారు&period; అన్నదమ్ములతో విబేధాలు తలెత్తుతుంటాయి&period; కుజ దోషం నుంచి బయటపడేందుకు కంది పప్పు&comma; మిరపకాయలు&comma; పచ్చి ఖర్జూర&comma; బెల్లం&comma; ఎరుపు వస్త్రాలు&comma; వ్యవసాయ పనిముట్లు దానం చేయాలి&period;సుబ్రహ్మణ్యస్వామి&comma; ఆంజనేయ స్వామిని పూజించాలి&period; జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే నరాల బలహీనత&comma; జ్ఞాపకశక్తి లేకపోవడం&comma; వ్యాపారాల్లో నష్టాలు ఎదురవుతాయి&period; బుధుడి అనుగ్రహం పొందేందుకు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి&period; వేంకటేశ్వరస్వామి&comma; విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి&period; ఆయా క్షేత్రాలను దర్శించుకోవాలి&period; వీటితోపాటు పెసరపప్పు&comma; ఆకుకూరలు&comma; కూరగాయలు&comma; ఆకుపచ్చ వస్త్రాలు&comma; విద్యార్థులకు విద్యా సంబంధమైన వస్తువులు దానం చేయాలి&period; ఆవుకు పచ్చగడ్డి వేయాలి&period; గ్రహాలు అన్నింటిలో పెద్దది గురు గ్రహం&period; జాతకంలో గురు గ్రహ దోషం ఉంటే సుఖ సంతోషాలు కరవవుతాయి&period; ఎన్ని పూజలు&comma; వ్రతాలు చేసిన ఫలితాలు ఉండవు&comma; గురు గ్రహ దోష నివారణకు గురుచరిత్ర పారాయణం చేయాలి&period; గురువులను గౌరవంచాలి&period; దైవ క్షేత్రాలను దర్శించుకోవాలి&period; శనగలు&comma; గుగ్గిళ్లు&comma; తియ్యటి పానీయాలు&comma; పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి&period; జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే స్త్రీలు అనారోగ్యానికి గురవుతారు&period; భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు&period; పెళ్లి కూడా ఆలస్యమవుతుంది&period; శుక్ర అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని పూజించాలి&period; పర్సులో వెండి నాణెం ఉంచుకోవాలి&period; స్త్రీలకు సంబంధించిన వస్తువులు దానం చేయాలి&period; శని గ్రహ దోష నివారణకు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి&period; నీలం ఆకుపచ్చ దుస్తులకు దూరంగా ఉండటం వల్ల కూడా దోష పరిహారం జరుగుతుంది&period; నుదుటిపై పసుపు పెట్టడం వల్ల గురు బలం పెరుగుతుంది&period; నువ్వులు&comma; వంట నూనె&comma; నీలి రంగు దుస్తులు దానం చేయాలి&period; రాహుగ్రహ దోష నివారణకు కనకదుర్గ అమ్మవారిని పూజించాలి&period; మినప సున్నుండలు&comma; ఇడ్లీలు&comma; మినప గారెలు&comma; పొగ రంగు వస్త్రాలు దానం చేయాలి&period; నానబెట్టిన మినుములు ఆవుకు పెట్టాలి&period; జాతకంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు మానసిక బలహీనతలు&comma; అతి భక్తి&comma; జీవితం మీద విరక్తి&comma; ఒంటరిగా ఉండాలనే భావనలు పెరుగుతాయి&period; కేతు గ్రహ దోషం నుంచి బయటపడేందుకు పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టాలి&period; తెలుపు రంగు కంబళి దానం చేయాలి&period; ఆలయాలకు విరాళాలు ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..