పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. నామినేషన్ల పర్వం పూర్తయిన నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిని కోసం వాహనాల అవసరం సెక్ట్రొల్ వారీగా గుర్తించి సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ లో విధులు నిర్వహించే వారు ఎక్కడి నుండి వస్తున్నారో తెలుసు కొని ట్రాన్స్పోర్ట్ ప్లాన్ తయారీ చేయాలన్నారు. శనివారం ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సoదర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఆయ నియోజకవర్గాల ఆర్ ఓ పరిది లోని పోలింగ్ కేంద్రాలకు రూట్ మ్యాప్, కమ్యూనికేషన్ ప్లాన్ ,పోస్టల్ బ్యాలెట్, వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ ప్లాన్, సిద్ధం చేసుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ సిబ్బంది సెకండ్ రాండ్నైజేషన్ కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆబ్సెంట్ షిఫ్ట్ డూప్లికేట్ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ విషయంలో పిర్యాదు వస్తే. చర్యలు తీసుకుంటామన్నారు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లనుపంపిణీ చర్యలు తీసుకోవాలన్నారు.ఓటింగ్ శాతం పెరిగేందుకు విస్తృత అవగాహన ప్రచారచర్యలు చేపట్టాలన్నారు. అందులకు ప్రత్యేకంగ బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ ను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు దివ్యాంగ ఓటర్లకు ఇంటివద్దె ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు హోమ్ ఓటింగ్ సెక్టోల్ వారీగా ఎంత మంది ఉన్నారో సమాచారాన్ని సిద్దం చేసుకోవాలన్నారు హోమ్ ఓటింగ్ కోసం వాహనాలను కూడా సిద్దం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్ నమోదు శాతంని పెంచేందుకు సెలబ్రెటీ ల ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలన్నారు.
పోలింగ్ కు ఏర్పాట్లు.. రోనాల్డ్ రోజ్
59
previous post