బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ అధికారి మాధవయ్య. బాల నగర్ ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ పరిధి ఎర్రగడ్డ జే కే టిఫిన్స్ సమీపంలో ఓ కారులో మద్యం తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం తో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. కారులో మద్యం తరలిస్తున్న ఇద్దరునీ అదుపులోకి తీసుకుని విచారించగా అల్లపూర్ లోని ఒక గోడౌన్ లో నిల్వ ఉంచిన ఇతర రాష్ట్రాల మద్యాన్ని సైతం సీజ్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 4లక్షల విలువ గల మద్యాన్ని, ఒక ఓమిని కారుని, ఒక చరవాణి ని స్వాధీన పరచుకుని రిమాండ్ కు తరలించామని తెలిపారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చినప్పటి నుండి 315కేసులు నమోదు చేసి 35మంది నీ అరెస్ట్ చేశామని, వారి వద్ద 6కోట్ల77లక్షల విలువ గల మాదక ద్రవ్యాలు, మద్యాన్ని స్వాధీన పరుచున్నామని తెలిపారు.
అక్రమ మద్యం పట్టివేత..
68
previous post