అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి..

Advertisements

<p>అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి&period; అసోంలో 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 80కి పైగా సీట్లు గెలుచుకుంటుందని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి&period; ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 30 సీట్లకే పరిమితం కానుంది&period; ఇతరులు 1 నుంచి 10 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి&period;126 సభ్యుల అస్సాం అసెంబ్లీలో మెజారిటీకి 64 స్థానాలు అవసరం&period; ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA 90 నుంచి 100 స్థానాల మధ్య గెలిచే అవకాశం ఉంది&period; మధ్యస్థ అంచనా ప్రకారం 95 సీట్లు రావొచ్చని తెలుస్తోంది&period; దీంతో బీజేపీ కూటమి సులభంగా అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి&period; కాంగ్రెస్ నేతృత్వంలోని ASM కూటమికి 23 నుంచి 33 స్థానాలు వచ్చే అవకాశం ఉంది&period; AIUDF కు 0 నుంచి 6 స్థానాల మధ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా&period; మరోవైపు 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలోనూ ఎన్డీయే మెజార్టీకి కావాల్సిన సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి&period; బీజేపీ&comma; మిత్రపక్షాలు 16 సీట్లకు పైగా గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..