ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది…

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది&period; ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2026ను ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు&period; ఈ బిల్లు ద్వారా 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేసి&comma; రాష్ట్ర నూతన రాజధానిగా అమరావతి పేరును అధికారికంగా చేర్చనున్నారు&period; ఈ బిల్లు ద్వారా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5&comma; సబ్-సెక్షన్ 2 కు సవరణ చేయనున్నారు&period; ప్రస్తుతం ఈ సెక్షన్‌లో ఉన్న&&num;8230&semi; రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని ఉంటుంది అనే వాక్యం స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందని చేర్చనున్నారు&period; అమరావతి అనే పదంలో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం&comma; 2014 ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయని ఈ సవరణలో స్పష్టంగా వివరించనున్నారు&period; ఈ సవరణ జూన్ 2&comma; 2024 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించనున్నట్లు బిల్లులో పేర్కొనడం గమనార్హం&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది&period; ఇందులో భాగంగా&comma; మార్చి 28à°¨ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది&period; పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించి అమరావతి పేరును అధికారికంగా చేర్చాలని ఆ తీర్మానంలో కేంద్రాన్ని కోరింది&period; 2022 మార్చి 3à°¨ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సలహా మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>అసెంబ్లీలో ఆమోదించిన ఈ తీర్మానాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు&period;&period; రాజ్యసభ ఛైర్మన్&comma; లోక్‌సభ స్పీకర్&comma; కేంద్ర హోంమంత్రి&comma; కేంద్ర హోంశాఖ కార్యదర్శి&comma; రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు&period; రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ బిల్లును తీసుకురానుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది&period; ఈ సవరణ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు చట్టపరంగా తెరపడుతుందని&comma; అమరావతికి తిరుగులేని చట్టబద్ధ హోదా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.