స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హైకోర్టు నమ్మింది కాబట్టే, ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారని కందుకూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. అక్రమ కేసు పెట్టించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామంలోని కృష్ణుడి గుడి ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. పార్టీ మినీ మేనిఫెస్టోకు సంబంధించిన పథకాలను స్థానికులకు వివరిస్తూ నాగేశ్వరరావు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారన్న భావన ప్రజల్లో మొదటి నుంచి ఉందన్నారు. అయితే వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని ఆయనకు బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశారని అన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదన్న బాధలతో హైకోర్టు ఏకీభవించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో వైసీపీ నేతలు ఎన్నో దుష్ప్రచారాలు చేశారని, అవన్నీ ఉత్తిత్తివేనని తేలిపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పిన మాటలు నిజమయ్యాయన్నారు. , జగన్ అరాచక పాలన పైనా, జనసేనతో కలిసి ఆయన పోరాటం సాగిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలంతా ఆయనకు అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలపాలని నాగేశ్వరావు కోరారు.
బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ
81
previous post