ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనకు కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.
chandrababu bail updates
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం. బాపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పురి సాయి కల్యాణి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు……మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి పూర్తిస్థాయి బెయిల్ మంజూరైన సందర్బంగా బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు… జనసేన గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు… అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించరు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హైకోర్టు నమ్మింది కాబట్టే, ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారని కందుకూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. అక్రమ కేసు పెట్టించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామంలోని కృష్ణుడి గుడి ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. పార్టీ మినీ మేనిఫెస్టోకు సంబంధించిన పథకాలను స్థానికులకు వివరిస్తూ నాగేశ్వరరావు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారన్న భావన ప్రజల్లో మొదటి నుంచి ఉందన్నారు. అయితే వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని ఆయనకు బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశారని అన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదన్న బాధలతో హైకోర్టు ఏకీభవించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో వైసీపీ నేతలు ఎన్నో దుష్ప్రచారాలు చేశారని, అవన్నీ ఉత్తిత్తివేనని తేలిపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పిన మాటలు నిజమయ్యాయన్నారు. , జగన్ అరాచక పాలన పైనా, జనసేనతో కలిసి ఆయన పోరాటం సాగిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలంతా ఆయనకు అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలపాలని నాగేశ్వరావు కోరారు.




Total views : 78477