రాష్ట్రంలో వైసీపీ చాప్టర్ క్లోజ్- నూకసాని బాలాజీ

Babu Surety - Guarantee program for the future

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా&comma; కందుకూరు నియోజకవర్గం&period;లింగసముద్రంలో బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం&period; ఓటమి భయంతో వణికిపోతున్న జగన్&period; జనం తంతారని వైసీపీ వాళ్ళకి అర్థమైపోయింది&period; చంద్రబాబుతోనే అభివృద్ధి&comma; సంక్షేమం సాధ్యం&period; తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిదే అంతిమ విజయం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు&period; బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం లింగసముద్రం గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించారు&period; నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి&comma; ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ&comma; పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి&comma; మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం హాజరయ్యారు&period; పార్టీ నేతలు ప్రతి ఇంటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాల గురించి వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి కథ కంచికి చేరిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు&period; ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో 99&percnt; నెరవేర్చలేదని&comma; బూటకపు వాగ్దానాలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని విమర్శించారు&period; ముఖ్యంగా ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు&period; అలాగే ఉద్యోగులు&comma; వ్యాపారులు&comma; కార్మికులు&comma; మహిళలు&comma; యువత&period; ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు&period; గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి&comma; సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి చంద్రబాబునాయుడు గారు పథకాలు అమలు చేస్తే&comma; వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని బాలాజీ తెలిపారు&period; కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడం&comma; ఏషియన్ పేపర్ పరిశ్రమ ఏర్పాటు కానియకుండా అడ్డుపడడం లాంటి విషయాలను కందుకూరు ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని&comma; రాబోయే ఎన్నికల్లో వైసిపికి గుణపాఠం తప్పదని బాలాజీ చెప్పారు&period; ప్రజలంతా మెచ్చే విధంగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలను ప్రకటించారని&comma; ప్రతి ఒక్కరూ తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి తప్పకుండా మద్దతు పలకాలని బాలాజీ కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదన్న విషయం జగన్ మోహన్ రెడ్డికి&comma; ఆ పార్టీ నేతలకు మూడు నెలలు ముందుగానే అర్థమైందన్నారు&period; ప్రజలకు ఇసుమంత కూడా మేలు చేయకుండా&comma; కేవలం డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారన్న భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నారని విమర్శించారు&period; అదే ప్రజలు తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈపాటికి జగన్ కు తెలిసిందని&comma; వైసీపీ దుకాణం మూతబడినట్టేనని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు&period; తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత&comma; వెనుకబడిన లింగసముద్రం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు&period; ముఖ్యంగా రాళ్లపాడు రిజర్వాయర్ విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి&comma; రైతులకు సాగు&comma; తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్నారు&period; ఈసారి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని నాగేశ్వరరావు అభ్యర్థించారు&period; అంతకుముందు లింగసముద్రం గ్రామానికి విచ్చేసిన పార్టీ నేతలకు&comma; స్థానికులు ఘన స్వాగతం పలికారు&period; ముందుగా ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ఈ సందర్భంగా&comma; చంద్రబాబు ప్రకటించిన తల్లికి వందనం&comma; ఆడబిడ్డ నిధి&comma; యువ గళం&comma; రైతుకు ఆర్థిక సహాయం&comma; ఉచిత గ్యాస్ సిలిండర్లు&comma; ఉచిత బస్సు ప్రయాణం&comma; బీసీలకు రక్షణ చట్టం తదితర పథకాల గురించి వివరిస్తూ షూరిటీ బాండ్లను అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..