ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు బీసీలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై, నెల్లూరు జిల్లా టిడిపి బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. వైసిపి పరిపాలనలో ఎక్కువగా నష్టపోయింది బీసీ లేనని, వారంతా ఐకమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సత్తా ఏమిటో చూపాలని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. దానికి సంబంధించి బీసీలను సమాయత్తం చేసేందుకు, కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలంతా సమావేశమయ్యారు. మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీనవర్గాలపై అధిక సంఖ్యలో దాడులు జరిగాయని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. బీసీ లను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని, సామాజిక బస్సుయాత్ర పేరుతో మరో నాటకం మొదలుపెట్టారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నష్టపోని కుటుంబమే లేదని, రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఐకమత్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని నాగేశ్వరరావు కోరారు. కందుకూరు నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మాలకొండ దేవస్థానం చైర్మన్ పదవుల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తూ బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలు హాజరవుతారని నాగేశ్వరరావు తెలిపారు.
వైసిపి పాలనలో నష్టపోయింది బీసీలే..
69
previous post