95
శ్రీకాకుళం జిల్లా.. పోలాకి మండలం సుసరం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లాలంటే రైతులు హడలెత్తిపోతున్నారు. ఏ క్షణంలో ఎటు నుండి ఎలుగు బంటి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. నిన్న సాయంత్రం సుసరాం గ్రామంలోని పొలంలో ఓ కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలని, కాయల్ని కొట్టుకొని తినేసిన ఎలుగుబంటి, మనిషి చెట్టు ఎక్కినట్లు ఎలుగుబంటి చెట్టు ఎక్కడం చూసి ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఎలుగుబంట్లు పొలాలలోనే కాకుండా చెట్లుపై వుండడంతో భయాందోళనకు గురైవుతున్నారు.