బీట్ రూట్ లో విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలలో బీట్ రూట్ కూడా ఒకటి. మలబద్ధకం నుండి ఉపశమనానికి తోడ్పడతాయి. వివిధ కడుపు సమస్యలను తగ్గించే గుణం కూడా ఉంది. దీర్ఘకాలం నుంచి ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్ రూట్ ఎంతో ప్రయోజనకరమైంది. 33 శాతం కీళ్లనొప్పుల సమస్యలు బీట్ రూట్ ను కొరకడం ద్వారా పరిష్కారమవుతాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు. బీట్ రూట్ లోని వర్ణద్రవ్యం శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీట్ రూట్ తినే అలవాటు ఉంటే ఆ ప్రమాదం తగ్గుతుంది. వీటిల్లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.
బీట్ రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
95