బెంగాల్ రాజకీయాల్లో సువెందు అధికారి సెన్సేషన్..

బెంగాల్ రాజకీయాల్లో సువెందు అధికారి సెన్సేషన్

Advertisements

<p>ప్రస్తుతం సువెందు అధికారి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది &period;దింతో అందరి దృష్టి సువెందు అధికారి పైనే వుంది &period;అసలు సువెందు అధికారి ఎవరు &quest; అయన చేసిందేంటి &quest; బీజేపీలో కీలక నేతగా ఎలా ఎదిగారు &quest; మమతా బెనర్జీ తో గొడవ ఎందుకు వచ్చింది &quest; మమతను గద్దె దించే వరకు నిద్రపోనని ఎందుకు శపధం చేసారు &quest; ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం గా మారింది &period; సువెందు అధికారి పశ్చిమ బెంగాల్ బీజేపీలో కీలక నేతగా ఎదిగిన నాయకుడు&period; మొదట్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో కొనసాగిన ఆయన&comma; తరువాత విభేదాల కారణంగా పార్టీని వీడి బీజేపీలో చేరారు&period; డిసెంబర్ 15&comma; 1970à°¨ పూర్బా మిద్నాపూర్ జిల్లాలో జన్మించిన సువెందు అధికారి రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగారు&period; ఆయన తండ్రి శిశిర్ అధికారి కూడా ప్రముఖ రాజకీయ నాయకుడు&period; కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది &period; 1995 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సువెందు అధికారి&comma; తరువాత మమతా బెనర్జీతో కలిసి కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరారు&period; ప్రారంభం నుంచే టీఎంసీలో కీలక పాత్ర పోషిస్తూ&comma; గ్రౌండ్ లెవెల్‌లో బలమైన నాయకుడిగా ఎదిగారు&period; ఆయన రాజకీయ ప్రయాణం మొదటి దశలోనే ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని తనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>టీఎంసీలో కీలక నాయకుడిగా ఎదిగిన సువెందు అధికారి&comma; 2009లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు&period; అనంతరం 2016లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకున్నారు&period; టీఎంసీ ప్రభుత్వంలో రవాణా&comma; నీటిపారుదల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు&period; ముఖ్యంగా నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు&period; ఈ ఉద్యమం ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది&period; ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు&period; అయితే కాలక్రమేణా టీఎంసీ నాయకత్వంతో విభేదాలు పెరగడంతో రాజకీయంగా కీలక మలుపు తీసుకున్నారు&period; 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద నిర్ణయంగా మారింది&period; ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది&period;<&sol;p>&NewLine;<p>బీజేపీలో చేరిన తర్వాత సువెందు అధికారి మరింత దూకుడుగా రాజకీయాలు కొనసాగించారు&period; 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి మమతా బెనర్జీపై విజయం సాధించడం ద్వారా సంచలనం సృష్టించారు&period; ఈ విజయం ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చింది&period; ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు&period; బలమైన మాస్ లీడర్‌గా పేరుగాంచిన ఆయనకు గ్రౌండ్ లెవెల్‌లో మంచి పట్టుంది&period; కఠిన నిర్ణయాలు తీసుకునే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది&period; మరోవైపు&comma; తన రాజకీయ ప్రయాణంలో పలు వివాదాలను కూడా ఎదుర్కొన్నారు&period; ముఖ్యంగా పార్టీ మార్పు&comma; టీఎంసీతో విభేదాలు రాజకీయ చర్చలకు దారి తీశాయి&period; అయినప్పటికీ&comma; తనదైన శైలిలో రాజకీయాలను కొనసాగిస్తూ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువెందు అధికారి &comma; మమతా బెనర్జీ మధ్య విభేదాలు సాధారణ రాజకీయ విభేదాలు కాదు… అది అధికారం&comma; వ్యక్తిగత ప్రతిష్టల పోరాటంగా మారింది&period; టీఎంసీలో తన ప్రాధాన్యం తగ్గిందన్న అసంతృప్తితో సువెందు అధికారి బయటకు వచ్చి బీజేపీలో చేరడం కీలక మలుపు&period; ప్రధానంగా టీఎంసీ లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనెర్జీ పెత్తనం పెరగడంతో సువెందు అధికారి సహించ లేకపోయారు &period; నందిగ్రామ్ పోరాటంలో మమతా కన్నా ఎక్కువ పేరు సువెందు అధికారికి వచ్చింది &period;ఇది పార్టీలో ఒక వర్గానికి మింగుడు పడలేదు &period;దింతో సువెందు అధికారికి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు &period; ఎక్కడ అయితే మమతా బెనెర్జీ తో కలిసి పోరాటం చేసారో అదే స్థానం నుంచి మమతాను ఓడించడం ద్వారా సువెందు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు&period; ఆయన పోరాట ధోరణి మాత్రం వాస్తవం&period; ప్రస్తుతం ఆయన బీజేపీకి బెంగాల్‌లో ప్రధాన ముఖచిత్రంగా మారారు&period; అయితే బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అవుతారా అన్నది ఇంకా అనిశ్చితంగానే ఉంది &period; పార్టీ నిర్ణయం&comma; రాజకీయ సమీకరణలు సీఎం ని నిర్ణయించడంలో కీలకంగా మారనున్నాయి &period; అయినప్పటికీ&comma; భవిష్యత్తులో సీఎం రేసులో సువెందు అధికారి ప్రధాన పోటీదారుడిగా ఉండటం ఖాయం&period; మొత్తం మీద ఆయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం పైనే ఆధారపడివుంది &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..