బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి..

Advertisements

<p>బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది&period; బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరీ ఎంపికయ్యారు&period; దాదాపు రెండు దశాబ్దాలు పాటు బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది&period; బీహార్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా బీజేపీ నేత సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు&period; సామ్రాట్‌ చౌదరి బీహార్‌ సీఎంగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period;<&sol;p>&NewLine;<p>57 ఏళ్ల సామ్రాట్ రాజకీయ ప్రస్ధానం తొంభై దశకంలో ఆరంభమైంది&period; తండ్రి శకుని చౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు&period; ఓబీసీ వర్గమైన కుష్వాహా కులానికి చెందినవారు&period; ఆర్జేడీ&comma; జనతాదళ్&comma; ఆ తరువాత బీజేపీలో చేరిన సామ్రాట్&period;&period;ఆయా పార్టీల్లో కీలక పదవుల్లో ఉంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు&period; 1999లో రబ్రీ దేవి ప్రభుత్వంలో కేవలం 19 ఏళ్లకే మంత్రి అయి ఆయన రికార్డు సృష్టించారు&period; ఆ తర్వాత జేడీ &lpar;యు&rpar;లో చేరారు&period; ఈ పార్టీలోనూ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు&period; ఆ తర్వాత బీజేపీలో చేరి కీలక నాయకుడిగా మారారు&period; ఆయనకు బిహార్‌లోని మూడు ప్రధాన పార్టీల్లో పని చేసినా&period;&period;నిజమైన రాజకీయ గుర్తింపు బీజేపీలోనే లభించింది&period;<&sol;p>&NewLine;<p>నితీష్ సలహా మేరకే బీజేపీ&period;&period; సామ్రాట్‌కు సీఎం పీఠం అప్పగించింది&period; శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత స్పందించిన సామ్రాట్ చౌదరి&period;&period;బీజేపీ కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ బాధ్యతను కేవలం ఒక పదవిగా కాకుండా&comma; ప్రజలకు సేవ చేసే పవిత్ర అవకాశంగా భావిస్తున్నానన్నారు&period; రాష్ట్రాన్ని అభివృద్ధి&comma; సుపరిపాలన&comma; శ్రేయస్సు దిశగా తీసుకెళ్లేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.