59
తెలంగాణ కొత్త సర్కారు ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పాదలు కదుపుతోంది. ఎలాంటి సంశయాలకు తావు లేకుండా సంకేతాలు ఇస్తోంది. సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ గా అద్భుతమైన విజయాన్ని అందించిన రేవంత్ కు కూడా పార్టీ మరచిపోలేని కానుక ఇచ్చింది. పార్టీని అన్నీ తానై నడిపి విజయతీరాలకు చేర్చిన రేవంత్ ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.