40 దేశాలకు బ్రిటన్ ఆహ్వానం

Advertisements

<p>ఇజ్రాయెల్&comma; అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ మూసివేసిన à°¹‌ర్మూజ్ జలసంధి సంక్షోభం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది&period; ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని తిరిగి తెరిపించేందుకు యునైటెడ్ కింగ్‌డమ్ నడుం బిగించింది&period; ఇందులో భాగంగా 40 దేశాలతో నిర్వహిస్తున్న అత్యవసర సమావేశానికి భారత్‌ను కూడా ఆహ్వానించింది&period; వర్చువల్‌గా జరిగే ఈ భేటీలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొనున్నారు&period; భారత ఇంధన భద్రతకు à°¹‌ర్మూజ్ జలసంధి అత్యంత కీలకం&period; దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో 40శాతం&comma; ద్రవీకృత సహజ వాయువు లో 50శాతం&comma; ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ లో 80శాతానిపైగా ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది&period; ఈ నేపథ్యంలో భారత నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇరాన్‌తో పాటు ఇతర సంబంధిత దేశాలతో చర్చిస్తున్నామని జైస్వాల్ తెలిపారు&period; ఈ చర్చల ఫలితంగానే గత కొన్ని రోజుల్లో ఆరు భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటగలిగాయని ఆయన వివరించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా స్పందించారు&period; గతంలో జలసంధిని తెరిపించడం తన ప్రాధాన్యత అని చెప్పిన ఆయన&comma; బుధవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ &&num;8216&semi;ట్రూత్ సోషల్&&num;8217&semi; వేదికగా ప్లేటు ఫిరాయించారు&period; &&num;8220&semi;మీ చమురు మీరే తెచ్చుకోండి&period; మీ కోసం మీరు పోరాడటం నేర్చుకోండి&period; అమెరికా ఇకపై మీకు సహాయం చేయదు&&num;8221&semi; అంటూ యూకే వంటి మిత్రదేశాలకు ఆయన సూచించారు&period; ఇరాన్‌ను ఇప్పటికే దెబ్బతీశామని&comma; కష్టమైన భాగం పూర్తయిందని ట్రంప్ పేర్కొన్నారు&period; మరోవైపు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు&period; ఫ్రాన్స్&comma; జర్మనీ&comma; జపాన్&comma; యూఏఈ సహా 35 దేశాలు సముద్ర భద్రత పునరుద్ధరణకు కలిసి పనిచేయడానికి అంగీకరించాయని ప్రకటించారు&period; నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడం&comma; చిక్కుకుపోయిన నౌకలు&comma; సిబ్బంది భద్రతను à°ª‌టిష్టం చేయడం&comma; కీలక సరుకుల రవాణాను తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు&period; యూకే విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీ అనంతరం&comma; తదుపరి కార్యాచరణపై అధికారులు చర్చిస్తారని సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.