64
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్త పై దాడి చేసిన ఘటన వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో చోటుచేసుకుంది. ఎలక్షన్ ప్రచారాల్లో భాగంగా రోడ్డుపై నిలుచుని ఉన్న కాంగ్రెస్ కార్యకర్త పై టీఆర్ఎస్ శ్రేణులు దాడిచేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామం వచ్చి తమ వారిపై దాడి చేయడం ఏమిటని గ్రామస్తులు ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర కాన్వాయ్ పై దాడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సండ్ర వాహనాన్ని అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీ నేతలు అకారణంగా దళితుడిపై దాడి చేయడంతో సండ్ర పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊరికి బీఆర్ఎస్ నేతలెవరూ ప్రచారానికి రావద్దంటూ హెచ్చరించారు.