బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం..

దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15శాతానికి పెంపు

Advertisements

<p>బంగారం&comma; వెండిపై కేంద్రం కీలక నిర్ణయం<br &sol;>&NewLine;దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15శాతానికి పెంపు<br &sol;>&NewLine;ఏడాదిపాటు బంగారం కొనొద్దని కోరిన ప్రధాని<br &sol;>&NewLine;ఆ ప్రకటన వెలువడిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం<br &sol;>&NewLine;రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>దేశంలో బంగారం&comma; వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6 నుంచి 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది&period; ఇందులో 10శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా&comma; మరో 5 శాతం AIDC రూపంలో ఉంటుంది&period; డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడం&comma; వాణిజ్య లోటు పెరగడంతో దిగుమతులను కట్టడి చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో భారతీయులు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు&period; ఆ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది&period; వాస్తవానికి బంగారంపై సుంకాలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ వర్గాలు తెలిపినప్పటికీ&comma; మారిన పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది&period; ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారుగా&comma; అతిపెద్ద వెండి వినియోగదారుగా ఉన్న భారత్&period;&period;దేశీయ అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది&period; ఇప్పటికే బంగారం&comma; వెండి ధరలు చుక్కలనంటుతున్న ఈ టైమ్‌లో దిగుమతి సుంకం పెంపుతో వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..