‘కాంబాటింగ్‌ హేట్‌’ బిల్లుకు కెనడా చట్టసభ ఆమోదం…

Advertisements

<p>విద్వేషపూరిత చర్యలు&comma; నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన &OpenCurlyQuote;కాంబాటింగ్‌ హేట్‌ బిల్లుకు కెనడా చట్టసభ ఆమోదం తెలిపింది&period; ఈ కీలక బిల్లుకు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఆమోదముద్ర వేయగా&comma; అనంతరం దీనిని ఎగువసభ కు పంపించారు&period; విద్వేష చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని నేరంగా పరిగణిస్తారు&period; ఇది అమల్లోకి వస్తే ప్రార్థనా స్థలాలపై దాడులు&comma; ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకుల అంచనా&period; ఈ చట్టం కోసం కెనడా లోని భారత సంతతి వ్యక్తులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నారు&period;<br &sol;>&NewLine;కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు ఇటీవల పెరిగిపోయాయి&period; కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం&comma; విధ్వంసం సృష్టించడం&period;&period; తదితర ఘటనలు పెరుగుతున్నాయి&period; ఈ తరహా ఘటనలపై ప్రవాస భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ఇటువంటి తరుణంలోనే విద్వేష చర్యలకు సంబంధించి కొత్త బిల్లు ఆమోదం పొందడం ఊరట కలిగించే విషయం&period;<br &sol;>&NewLine;నిషేధిత సంస్థల చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడం&comma; కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలను కొత్త బిల్లు ప్రకారం తీవ్ర నేరంగా పరిగణిస్తారు&period; యూదులు&comma; ముస్లింలు&comma; ఇతర మతాల వారిని ఆయా ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా నేరమే&period; ఇటువంటి చర్యలకు పాల్పడేవారికి గరిష్ఠంగా పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది&period; అయితే&comma; కన్జర్వేటివ్‌లు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..