ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఇంధన లభ్యతపై సమావేశాలు నిర్వహించారు…

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితుల ప్రభావంపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది&period; ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఇంధన లభ్యతపై సమావేశాలు నిర్వహించారు&period; దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని&period;&period;వదంతులు నమ్మవద్దని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది&period; తాజాగా దేశంలో నిత్యావసరాల లభ్యత&comma; వాటి ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది&period; నిత్యావసర ధరల్లో పెద్దగా మార్పులు లేవని బఫర్ స్టాక్స్ తగినంతగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది&period; దేశంలో గోధుమలు&comma; బియ్యం నిల్వలు అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని&comma; ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆహార &&num;8211&semi; ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి&period;శిఖ స్పష్టం చేశారు&period; బఫర్ స్టాక్ నిబంధనల కంటే మూడు రెట్లు అధికంగా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు&period; ప్రస్తుతం ప్రభుత్వం వద్ద గోధుమలు సుమారు 222 లక్ష మెట్రిక్ టన్నులు&comma; బియ్యం&colon; సుమారు 380 లక్ష మెట్రిక్ టన్నులు ఉన్నాయని తెలిపారు&period; ఈ నిల్వలు ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలను తీర్చడమే కాకుండా&comma; ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సరిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు&period;భారతదేశానికి కీలక భాగస్వామ్య దేశాలైన ఇండోనేషియా&comma; మలేషియా&comma; రష్యా&comma; ఉక్రెయిన్&comma; అర్జెంటీనా బ్రెజిల్ నుండి దిగుమతులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని శిఖ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.